కొమ్మినేని శ్రీనివాసరావు | |||
కొమ్మినేని శ్రీనివాసరావు | |||
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ | |||
పదవీ కాలం 2022 అక్టోబరు 27 - జనవరి 2024 [1] | |||
వ్యక్తిగత వివరాలు | |||
---|---|---|---|
జననం | (1956-08-26) 1956 ఆగస్టు 26 (వయసు 68) గన్నవరం, ఆంధ్రప్రదేశ్ | ||
తల్లిదండ్రులు | కొమ్మినేని రామరావు, కొమ్మినేని జయలక్ష్మీ | ||
జీవిత భాగస్వామి | కొమ్మినేని రాజ్యలక్ష్మీ | ||
వృత్తి | పాత్రికేయుడు రచయిత టాక్ షో అతిధేయుడు |
కొమ్మినేని శ్రీనివాసరావు (జననం 1956 ఆగస్టు 26) కె.ఎస్.ఆర్ గా సుపరిచితులు. ఆయన తెలుగు జర్నలిష్టు, రచయిత, దూరదర్శన్ వ్యాఖ్యాత. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమితులయ్యేనాటికి సాక్షి టీవీలో పనిచేస్తున్నాడు.[2] అయిన ఇక్కడ కేఎస్ఆర్ లైవ్ షో తో గుర్తింపుతెచ్చుకున్నాడు.
కొమ్మినేని శ్రీనివాసరావు గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో కొమ్మినేని రామారావు, జయలక్ష్మి దంపతులకు జన్మించాడు.
ఆయన గన్నవరంలో పాఠశాల, కళాశాల విద్యలను అభ్యసించాడు. ఆ తరువాత ఆయన ఎం.కాం పూర్తిచేసారు.
అతను సుమారు 33 సంవత్సరాలు వివిధ వార్తా పత్రికలలో, టీవీ చానెళ్ళలో విలేకరిగా పనిచేశారు.
1978లో అతను ఈనాడు లో చేరాడు. ఈనాడు లో చేరక ముందు అతను అనేక పత్రికలలో అనేక వ్యాసాలను రాశారు. అతను విజయవాడ, తిరుపతి తరువాత హైదరబాదులలో పనిచేసాడు. అతను పత్రికలలో వివిధ భాద్యతలను నిర్వర్తించారు. సబ్ ఎడిటరుగా, రిపోర్టరుగా, ఛీఫ్ రిపోర్టరుగా వివిధ స్థానాలలో తన సేవలనందించారు. 1986లో జరిగిన గోదావరి జిల్లాలలో జరిగిన వరద భీభత్సం, 1990లో లాథూరులో జరిగిన భయంకరమైన భూకంపం, 1992లో తిరుపతిలో జరిగిన ఎ.ఐ.సి.సి కార్యక్రమం, తెలుగుదేశంపార్టీ మహానాడు వంటి వాటిలో అతను పాత్రికేయునిగా ముఖ్య భూమిక పోషించారు. అతను ఢిల్లీలో ఈనాడు బ్యూరో ఛీఫ్ గా పనిచేశారు. పార్లమెంటు పై టెర్రరిస్టుల దాడి జరిగినపుడు ఆ సంఘటనను వార్తాంశంగా చిత్రీకరించారు. బిల్ గేట్స్ హైదరాబాదు వచ్చినపుడు ఆ వార్త ప్రచురణద్వారా గుర్తింపు పొందారు.
అతను 2002లో ఆంధ్రజ్యోతి లో చేరారు. నాలుగున్నరేళ్ళు ఆంధ్రజ్యోతి పత్రికకు భ్యూరో చీఫ్ గా భాద్యతలను చేపట్టారు.
ఆధ్రజ్యోతిలో పనిచేసిన తరువాత అతను ఎన్.టి.వి లో చేరారు. ఆ మేనేజిమెంటుతో వచ్చిన విభేదాల వలన కొద్దినెలలలోనే ఆ ఛానెల్ నుండి తప్పుకున్నాడు. తరువాత టి.వి.5 టెలివిజన్ ఛానెల్ లో పొలిటికల్ ఎడిటరుగా చేరి ఆ ఛానెల్‌కు సంపాదకునిగా కూడా పనిచేసాడు. అతను "న్యూస్ స్కాన్" అనే కార్యక్రమాన్ని రూపొందించాడు. దీని ఫలితంగా అతనికి విశేష గుర్తింపు వచ్చింది. అనేక మంది రాజకీయ నాయకులను ఇంటర్వ్యూలు చేయడం ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ఆ ఛానెల్ లో రెడున్నరేళ్ళు పనిచేసి తరువాత ఎన్.టి.విలో ప్రధాన సంపాదకునిగా పనిచేసాడు.
అతను ప్రస్తుతం సాక్షిలో పనిచేస్తున్నాడు. అతను "లైవ్ షో విత్ కె.ఎస్.ఆర్" కార్యక్రమాన్ని రూపొందించాడు.
అతను 1982లో రాజ్యలక్ష్మీని వివాహమాడాడు. ఆమె ఎ.పి సీడ్స్ లో అధికారిణి.